RSS | బండి భగీరథ్ ‘పోక్సో’ వివాదంతో ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు..!
RSS : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు(POCSO Case)తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఆర్ఎస్ఎస్(RSS) నాయకుడు బి. సుందర్ రెడ్డి తేల్చి చెప్పారు.
RSS : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ‘పోక్సో’ కేసు(POCSO Case)తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఆర్ఎస్ఎస్(RSS) నాయకుడు బి. సుందర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇది బీజేపీ అంతర్గత సమస్య అని పేర్కొన్న ఆయన కొన్ని మీడియా సంస్థలు తమ కార్యకర్తలను వివాదంలోకి లాగడాన్ని ఆయన తప్పుబట్టారు.
బండి భగీరథ్ పోక్సో కేసు వివాదంలో కొన్ని మీడియా సంస్థలు ఆర్ఎస్ఎస్ నాయకుల పేర్లను ప్రస్తావించడాన్ని బి. సుందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మాకు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోస్కో కేసుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. బండి సంజయ్‌కు.. ప్రాంత కార్యవాహ కాచం రమేష్, ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ల మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని, అందుకే.. వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే నిరాధార ఆరోపణలను ఆయన ఖండించారు.

భగీరథ్ పోక్సో కేసులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను లాగడం, అసత్య కథనాలతో వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బీజేపీ అంతర్గత, సంస్థాగత వ్యవహరాలను కేంద్ర నాయకత్వం నేరుగా పర్యవేక్షిస్తుందని.. ఇందులో రాష్ట్ర ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోదని సుందర్ రెడ్డి వివరించారు.
బండి భగీరథ్ పోక్సో కేసు వివాదంతో మాకు సంబంధం లేదు.. ఇది బీజేపీ అంతర్గత సమస్య
తేల్చి చెప్పిన తెలంగాణ ఆర్ఎస్ఎస్
కొన్ని మీడియా వర్గాలు తమ సంస్థను, దాని కార్యకర్తలను ఈ వివాదంలోకి లాగుతున్నాయని మాకు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోస్కో కేసుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన… pic.twitter.com/ptlL0f1vwr
— Telugu Scribe (@TeluguScribe) May 22, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

