RS Praveen Kumar | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22A ద్వారా భూములను నిషేధిత జాబితాలో పెట్టి సిగ్గులేకుండా టోల్‌ఫ్రీ నంబర్ పెట్టామని చెప్తున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై కుమ్రంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో బీఆర్ఎస్ పోరుబాట ( BRS Protest ) నిర్వహించింది. మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే, బాధితుల నంబర్లు తీసుకుని ఒక వారం రోజులకు వాళ్లకు బ్రోకర్‌గాళ్లు ఫోన్ చేస్తారు. నీకున్న భూమిలో కొంత మాకు రాసిస్తే నీ భూమిని నిషేధిత జాబితా నుంచి తీసేస్తామని చెప్తారు. ప్రభుత్వ అధికారులకు కూడా తెలియకుండానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి ద్వారా మన భూములను వేరే వాళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడని ఆరోపించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22A ద్వారా భూములను నిషేధిత జాబితాలో పెట్టి, సిగ్గులేకుండా టోల్‌ఫ్రీ నంబర్ పెట్టామని చెప్తున్నాడు
టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే, బాధితుల నంబర్లు తీసుకుని, ఒక వారం రోజులకు వాళ్లకు బ్రోకర్‌గాళ్లు ఫోన్ చేస్తారు
నీకున్న భూమిలో కొంత మాకు రాసిస్తే, నీ… https://t.co/h2mr4x5xYI pic.twitter.com/HiKInIdxux
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2026