మామూళ్ల మత్తులో వైద్యాధికారులు
మెడికవర్ దవాఖానలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏడుగురు రోగులు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. శుక్రవారం ఒకరోజే నలుగురు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ విషయం బయటకు రాకుండా ఆస్ప్రత్రి యాజమాన్యం తొకిపెట్టే ప్రయత్నం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. వరుస మరణాలతో రోగుల బంధువులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
- ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టదా?
- మెడికవర్ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : మెడికవర్ దవాఖానలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏడుగురు రోగులు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. శుక్రవారం ఒకరోజే నలుగురు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ విషయం బయటకు రాకుండా ఆస్ప్రత్రి యాజమాన్యం తొకిపెట్టే ప్రయత్నం చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. వరుస మరణాలతో రోగుల బంధువులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డీఎంహెచ్వోలు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ దవాఖానల తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

