RS Praveen Kumar | మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని తెలిసిందే. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులను సీఐ రఘుపతి రెడ్డి గొంతు పట్టుకుని నెట్టేసిన విజువల్స్ పోలీసుల దౌర్జన్యాన్ని కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. శక్తి స్కీమ్‌లో పాలిటెక్నిక్ కాలేజీని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు.
విద్యార్థుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మహబూబాబాద్‌లో జాటోత్ రాజేష్ అనే పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పట్టి సీఐ రఘుపతి రెడ్డి దాడి చేశాడు. మీరు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా.. ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలిసింగ్ ఏమో కానీ మీరు మా పిల్లలను గొంతు పట్టి చంపే ప్రయత్నం చేసిన సీఐ రఘుపతి రెడ్డిని అర్జెంట్‌గా సస్పెండ్ చేయాలని నేను డీజీపీని డిమాండ్ చేస్తున్నానన్నారు.
మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా విద్యార్థులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లి వ బీఆర్ఎస్వీ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను, తుంగ బాలు విద్యార్థుల తరపున పోరాటం చేస్తుంటే.. బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని మేం పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రికి ఈ విద్యార్థుల భవిష్యత్ మీద ఏ మాత్రం శ్రద్ధ లేదు. ఆయనకు ఉన్న శ్రద్ధంతా డబ్బులుఎట్లా సంపాదించుకోవడమని మండిపడ్డారు.
మహబూబాబాద్‌లో జాటోత్ రాజేష్ అనే పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పట్టి సీఐ రఘుపతి రెడ్డి దాడి చేశాడు
పిల్లల మీద దాడి చేసిన సీఐ రఘుపతి రెడ్డిని డీజీపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం
మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా విద్యార్థులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు… https://t.co/z0hVnd3wSw pic.twitter.com/jeKOFI0Gii
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2026