ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన 25 మంది వ్యక్తుల పేర్లతో ఉన్న 2006 ఎకరాల భూములపైనా జీవో-134 పరిధిలోకి తీసుకొచ్చి విచారణ జరుపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
- ఆ భూములను జీవో-134 పరిధిలోకి తేవాలి
- ఆర్టికల్14కు విరుద్ధంగా దేవసేన కమిటీ
- స్పందించకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం
- బీఆర్ఎస్ నేతల భూములపైనే విచారణా?
- పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన 25 మంది వ్యక్తుల పేర్లతో ఉన్న 2006 ఎకరాల భూములపైనా జీవో-134 పరిధిలోకి తీసుకొచ్చి విచారణ జరుపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుల భూముల వివరాలను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుకు ప్రవీణ్‌కుమార్ లేఖ రాశారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలోనే ఆ లేఖపై సంతకం చేశారు. ఆ 2006 ఎకరాల భూముల వివరాలను సర్వేనంబర్లతో సహా ఆయన మీడియాకు వెల్లడించారు. తన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల భూములే లక్ష్యంగా, వారి భూముల వ్యవహారాలపై విచారణ జరిపేందుకు సెప్టెంబర్ 24న జీవో 134ను సీఎస్ జారీ చేశారని చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారి దేవసేన చైర్మన్‌గా ఉన్న కమిటీకి ఈ బాధ్యతలు అప్పగించారని, అయితే, విచారణ పరిధిలోకి తీసుకున్న భూముల ఎంపికలో కక్షసాధింపు చర్యలు ఉన్నాయని విమర్శించారు. విచారణ ప్రక్రియపై సందేహాలు తలెత్తకుండా స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేవసేన కమిటీ అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వారి కుటుంబసభ్యులకు సంబంధించిన భూములను ఒకే ప్రమాణాలతో పరిశీలించాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, నైమిషారెడ్డి, సత్యనారాయణరెడ్డి, తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి, బొడ్డు వినోద్‌కుమార్, బీర్ల అయిలయ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలకు సంబంధించిన భూములపైనా దేవసేన కమిటీ విచారణ జరుపాలి. అందరికీ ఒకే విధమైన ప్రమాణాలను పాటించాలి.
-ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ప్రతీకార పాలనకు ఇదే నిదర్శనం
రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట ప్రతీకార పాలన కొనసాగుతున్నదని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆర్టికల్ 14కు విరుద్ధంగా జీవో నంబర్ 134 కింద ఏర్పాటుచేసిన దేవసేన కమిటీ కేవలం బీఆర్ఎస్ నాయకులు, వారి కుటుంబసభ్యులకు చెందిన భూములపైనే ప్రధానంగా దృష్టి సారించడం వివక్షాపూరిత చర్య అని మండిపడ్డారు. ఆ కమిటీకి ప్రధానంగా బీఆర్ఎస్ నాయకుల భూముల వివరాలనే అందించారని తెలిపారు. జీవోలో బీఆర్ఎస్ నాయకుల భూములనే విచారించాలని లేనప్పటికీ ఆ పార్టీ నేతల భూములపైనే కమిటీ దృష్టి సారించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నదని విమర్శించారు.
అండ్ అసోసియేట్స్ పేరుతో జాబితా
జీవో 134 పరిధిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకుల భూములను చేర్చారని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సంబంధం లేని వ్యక్తులను సైతం ‘అండ్ అసోసియేట్స్’ పేరుతో జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఈ జాబితాలో పేర్లు ఉన్నంత మాత్రాన ఆయా భూముల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ కాదని, ప్రతి వ్యవహారాన్ని చట్టప్రకారం, ఆధారాల ఆధారంగా పరిశీలించాలని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారు ఎల్విన్ స్టీఫెన్సన్ పేరుతో సికింద్రాబాద్‌లో ఉన్న భూములపైనా విచారణ జరుపాలని నిర్ణయించడం వెనుక రాజకీయ కక్షసాధింపు చర్యలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో స్టీఫెన్సన్కు రూ.50లక్షలు లంచం ఇస్తూ రేవంత్‌రెడ్డి పట్టుబడ్డారని, ఆ వ్యవహారంలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు గొంతు వినిపించిందని గుర్తుచేశారు. ఈ కేసును తిరిగి మొదటి నుంచి విచారించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందని తెలిపారు. స్టీఫెన్సన్కు ప్రాణహాని ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
వీరి భూములనూ పరిశీలించండి
సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యుల భూములతోపాటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన భూముల వివరాలనూ దేవసేన కమిటీ పరిశీలించాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, నైమిషారెడ్డి, సత్యనారాయణరెడ్డి, తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి, బొడ్డు వినోద్‌కుమార్, బీర్ల అయిలయ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులకు సంబంధించిన భూములపై దేవసేన కమిటీ విచారించాలని కోరారు. రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, నాగర్‌కర్నూల్, మేడ్చల్-మలాజిగిరి, నారాయణపేట, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని కాంగ్రెస్ నేతల భూముల వివరాలన్నింటినీ పరిశీలించాలని కోరారు.
సీఎస్ గారూ ఇవిగో ఆధారాలు
సీఎస్‌కు రాసిన లేఖలో కాంగ్రెస్ నేతలకు చెందిన భూముల వివరాలను ఆధారాలతో సహా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తావించారు. శేరిలింగంపల్లిలోని సర్వేనంబర్ 127లో రేవంత్‌రెడ్డికి సంబంధించిన భూముల వివరాలను పరిశీలించాలని కోరారు. యాదాద్రి-భూవనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మలాపురంలోని సర్వేనంబర్ 646 పరిధిలో గీతారెడ్డి పేరుతో 107 ఎకరాల భూమి ఉన్నదని తెలిపారు. వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నైమిషారెడ్డి, సత్యనారాయణరెడ్డి పేర్లపై 128 ఎకరాల భూమి ఉన్నదని ఆరోపించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో తిరుపతిరెడ్డి పేరుతో ఉన్న భూములను పరిశీలించాలని కోరారు. కుత్బుల్లాపూర్‌లోని సర్వేనంబర్ 87 పరిధిలో నైమిషారెడ్డి పేరుతో ఉన్న రెండు ఎకరాల భూమి మారెట్ విలువ రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉంటుందని, దానిని రూ.7 కోట్లకే కొనుగోలు చేశారని తెలిపారు. వెల్దండ, వంగూరు ప్రాంతాల్లో కొండల్‌రెడ్డి పేరున ఉన్న భూములనూ విచారణ పరిధిలోకి తేవాలని కోరారు. ఈ భూముల యాజమాన్య హకులు, కొనుగోలు ధరలు, రిజిస్ట్రేషన్ వివరాలు, మారెట్ విలువలను సంబంధిత రికార్డుల ఆధారంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.
ఎంపీ చామల భూములను పరిశీలించాలి
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి భూములనూ, ఆయన అండతో జరిగిన అవకతవకలను దేవసేన కమిటీ పరిశీలించాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మేరుగు గోపాల్‌యాదవ్ పేరుతో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 200 ఎకరాలకుపైగా భూములు అక్రమంగా బదిలీ అయ్యాయని, ఈ వ్యవహారంలో ఎంపీ చామల అండ ఉన్నదని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డికి చెందిన భూవ్యవహారాలపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో తహసీల్దార్‌గా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి రెండేండ్ల తన ఉద్యోగకాలంలో భూముల లావాదేవీలకు సంబంధించి ఎవరెవరికి మామూళ్లు అందాయనే అంశంపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం చింత చెరువు ఫీడర్ చానల్ ఎఫ్టీఎల్ పరిధిలో సుమారు 200 ఎకరాల భూమికి సంబంధించి సంఘీ విల్లాల నిర్మాణాలపై అభ్యంతరాలు ఉన్నాయని, వాటిపైనా విచారణ జరుపాలని కోరారు. పేదలు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి నిర్మించుకున్న చిన్న ఇండ్లను కూల్చివేసే హైడ్రా అధికారులు.. పెద్దల విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాల విషయంలోనూ అదే ప్రమాణాలను పాటించాలని డిమాండ్ చేశారు.
ఇది మొదటిదే.. త్వరలో రెండో ఎపిసోడ్!
దేవసేన నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపాల్సిన భూముల వివరాలపై ఇది మొదటి ఎపిసోడ్ మాత్రమేనని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మొత్తం 25 మంది వ్యక్తులకు సంబంధించిన 2,006 ఎకరాల భూముల వివరాలను ప్రజల నుంచి సేకరించిన సమాచారంతో వెల్లడిస్తున్నామని వివరించారు. రెండో ఎపిసోడ్లో మరిన్ని భయంకరమైన వివరాలు, ఆధారాలను బయటపెడుతామని ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పందించి, కాంగ్రెస్ నాయకుల భూముల వివరాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకోవాలని, లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.
రేవంత్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం
‘రాష్ట్రంలో జరిగిన ఓ భారీ కుంభకోణంలో కీలక సూత్రధారుల పాత్ర త్వరలోనే బయటపడుతుంది. బాధ్యులంతా మళ్లీ జైలుకెళ్లడం ఖాయం’ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఎక్స్ వేదికగా మంగళవారం ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎల్ కాంగో అని సంబోధిస్తూ.. ఈ కుంభకోణంలో ఎందరో కీలక నేతల జాతకాలు బయటపడుతాయని, వారంతా తమ సంచులు సర్దుకొని మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ‘శ్రమజీవుల పొట్టలు కొట్టిన మిమ్ములను దేవుడు కూడా క్షమించడు రేవంత్ గారూ’ అంటూ పేర్కొన్నారు. నిజం ఎప్పటికీ దాచినా దాగదని పేరొన్నారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ రాసిన ప్రసిద్ధ కవితా పంక్తులను ఆయన గుర్తుచేశారు.‘ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలిప్పుడు! దాచేస్తే దాగని సత్యం’ అని ఉటంకించారు. తెలంగాణ సమాజం తరఫున నిలబడి, నిజాన్ని నిర్భయంగా బయటపెడుతున్నందుకు ‘నమస్తే తెలంగాణ’ పత్రికా యాజమాన్యానికి, విలేకరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
పొంగులేటి, ఇతరుల భూములనూ పరిశీలించండి
హైదరాబాద్ శివారు నాదర్గుల్లో సర్వేనంబర్ 613 పరిధిలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించి 373 ఎకరాల భూమి ఉన్నదని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. వట్టినాగులపల్లిలో హర్షారెడ్డి పేరుతో 245, 259 సర్వేనంబర్ల పరిధిలో 27 ఎకరాల భూమి ఉన్నదని, పుప్పాలగూడలో ఆయన పేరుతో 14 ఎకరాల భూమి ఉన్నదని పేర్కొన్నారు. వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అల్వాల్రెడ్డికి 48 ఎకరాలు, కల్వకుర్తి మండలం ఎల్లికల్‌లో యెన్నం రమేశ్‌రెడ్డికి 58 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఖాజాగూడలో సాస్ ఇన్ఫ్రాకు చెందిన 3.17 భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఖానామెట్‌లో కరీజ్ ఖాతాకు సంబంధించిన 26 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు. కొల్లూరులో బొడ్డు వినోద్‌కుమార్‌కు చెందిన మూడు ఎకరాల భూమి, గచ్చిబౌలిలో 36 ఎకరాలు, మహేశ్వరంలో 400 ఎకరాల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, తుమ్మలూరులో భువన్ ఇన్ఫ్రా పేరుతో ఉన్న 25 ఎకరాల భూమి వివరాలనూ పరిశీలించాలని డిమాండ్ చేశారు. కీసర, నాగారం ప్రాంతాల్లో ఎస్సీలకు చెందిన భూములుగా పేరొంటున్న 41 ఎకరాల విషయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. రాజాపేట, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు చెందినవిగా పేరొంటున్న 251 ఎకరాల భూములు, శంషాబాద్‌లో ఎంపీ మల్లు రవి పేరుతో ఉన్న 86 ఎకరాల భూముల వివరాలను కూడా కమిటీ పరిశీలించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

