RS Praveen Kumar | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ విషయంలో రాంచందర్ రావు నిందలు హాస్యాస్పదం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | బండిసంజయ్‌ను రాజీనామా చేయాలని కూడా రాంచందర్ రావు డిమాండ్ చేయలేదు. ఈ రోజు అదే రాంచందర్ రావు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ విషయంలో చాలా విచిత్రంగా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేస్తున్నారు. నిజంగా హాస్యాస్పదమన్నారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
RS Praveen Kumar | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాంచందర్ రావు అజ్ఞానంతో మాట్లాడుతున్నట్టుగా మాకనిపించింది. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మాట్లాడాల్సిన మాటలు కావన్నారు. వారు గతంలో కూడా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకు బండి భగీరథ్ మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటనపై రాష్ట్రమంతటా పెద్ద ఎత్తు ఆందోళన జరిగింది. ఆ ఆందోళనలో ఎక్కడా కూడా రాంచందర్ రావు ఆ మైనర్ బాలికకు సపోర్ట్ చేసినట్టుగా కనిపించలేదు. అదేవిధంగా బండిసంజయ్‌ను రాజీనామా చేయాలని కూడా రాంచందర్ రావు డిమాండ్ చేయలేదు. ఈ రోజు అదే రాంచందర్ రావు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ విషయంలో చాలా విచిత్రంగా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేస్తున్నారు. నిజంగా హాస్యాస్పదమన్నారు.
ఈ రెండు సంఘటనల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ విషయంలో బాధిత మహిళ ఇంకా బయటకు రాలేదు. వారి కుటుంబం వివరాలు తెలియవు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జరుగుతున్నది. కొంతమంది కార్యకర్తల దగ్గర ఆ వీడియో ఉంది.. అసదుద్దీన్ ఒవైసీ దగ్గర చేతికి కూడా ఆ వీడియో పోయింది. అందుకోసం ఆయన దాన్ని చూసి మరేమనుకున్నారో ఏమో ఆయన వాళ్ల పార్టీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారు. రాజీనామా కూడా చేయమన్నారు. ఇంతవరకు ఆ బాధిత మహిళ కూడా బయటకు రాలేదు. పోలీస్‌స్టేషన్‌లో కూడా బాధిత మహిళ ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. నిజంగా ఆ బాధిత మహిళ ఎవరో తెలిస్తే ఆమెను తీసుకొని పోలీస్ కమిషనర్ కానీ, డీజీపీ దగ్గరకు తీసుకెళ్లి కేసు నమోదు చేసి వెంటనే బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని అసదుద్దీన్ ఒవైసీకి చెబుతున్నమన్నారు.
ఆ వీడియోలు కూడా అసదుద్దీన్ ఒవైసీ దగ్గర ఉంటే వెంటనే పోలీసులకు కస్టడీలో ఇవ్వమని చెబుతున్నం. దర్యాప్తు ఎలాగైనా చేస్తరు. ఎమ్మెల్సీ కూడా నా మీద ఎవరో డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫ్డ్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తునన్నరని ప్రయత్నిస్తున్నరు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో 564/20, 26 మీద కేసు నమోదైందన్నారు.
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
గతంలో కూడా బండి భగీరథ్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే రాంచందర్ రావు మైనర్ బాలికకు సపోర్ట్ చేసినట్లు మాకు ఎక్కడ కనిపించలేదు
బండి సంజయ్‌ని రాజీనామా… https://t.co/eLFuGuI6gz pic.twitter.com/d2PwoT8kSJ
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2026
Read Also :
Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు
వైభవంగా మార్వాడీల కావడి యాత్ర.. హరిహర మహాదేవ’ నామస్మరణతో సాగిన భక్తుల పాదయాత్ర
TVK vs Cong | కాబోయే ప్రధాని విజయ్ అంటూ జోరుగా ప్రచారం.. అధికార కూటిమిలో కలకలం..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

