పీర్జాదిగూడ, జూలై 18: హైదరాబాద్‌లోని బోడుప్పల్, పీర్జాదిగూడలో నూతనంగా ఏర్పా టు చేసిన ఆర్ ఎస్ బ్రదర్స్ 19వ వస్త్ర సముదాయాన్ని శనివారం టాలివుడ్ జంట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు షోరూమ్ లోని వివిధ విభాగాలను సందర్శించారు. షోరూమ్‌లోని వస్ర్తాలను పరిశీలించా రు. శుభకార్యాలు, పర్వదినాలకు అన్ని వయస్సుల వారి అభిరుచులకు తగ్గ వస్ర్తాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఆర్ ఎస్ బ్రదర్స్ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో ఫౌండర్, చైర్మన్ పీ వెంకటేశ్వర్లు, టీ ప్రసాద్‌రావు పాల్గొన్నారు.