హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నమోదైన 1030 కేసుల్లో రూ.37 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కాల్చివేసినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని 15 జిల్లాల్లో 847 గంజాయి మొకలు, 24,690 కేజీల గంజాయి, 172 కేజీల హషీష్ ఆయిల్, 4 కేజీల గంజాయి చాక్లెట్స్, ఓపీఎం, పాపిష్ట 155 కేజీలు, ఎండీఎంఏ 518 గ్రాములు, ఎల్ఎస్డీ బ్లాట్స్ 326, ఎస్టీసీ పిల్స్ 97, కొకైన్ 6 కేజీలు, అల్ఫోజోలం 223 కేజీలు, డైజోఫామ్ 106 కేజీలను దహనం చేశామని వెల్లడించారు. మరికొన్ని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 750 గంజాయి మొకలు, 1750 కిలోల గంజాయి, 160 కేజీల హషీష్ ఆయిల్, వంద గ్రాముల ఎండీఎంఏ, 90 ఎల్ఎస్డీ బ్లాట్స్, 150 కేజీల మేర అల్ఫోజోలం నిల్వ ఉన్నాయని, వాటిని కూడా ఈ నెలలో కాల్చివేస్తామని తెలిపారు.