హైదరాబాద్, ఆగస్టు23 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ పరిధిలోని పలు ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు కలిపి మొత్తంగా రూ.174.96 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ కార్పొరేషన్ రూ.4కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1.13కోట్లు, తాడిటాపర్ కార్పొరేషన్‌కు రూ.1.22కోట్లు, వాషర్మెన్ ఫెడరేషన్‌కు రూ.16.51లక్షలు, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ. 18.66లక్షలు, బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.29.83లక్షలు, బీసీ గురుకుల సొ సైటీకి రూ.167.94కోట్లను మంజూరు చేశారు.