బీఎల్వో విధుల నుంచి తప్పుకొన్న ఆర్పీలు
పెద్దపల్లి జిల్లా రా మగుండం నగరపాలక సంస్థలో బీఎల్వో విధుల నుంచి ఆర్పీలు తప్పుకొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. రామగుండం నగరపాలక సంస్థలో 118మంది ఆర్పీలు పని చేస్తుండగా, వీరిలో 112మందికి 2016 నుంచి బీఎల్వోలుగా అదనపు విధులు కేటాయించారు.
- రామగుండంలో మూకుమ్మడి రాజీనామాలు
కోల్‌సిటీ, ఏప్రిల్ 9: పెద్దపల్లి జిల్లా రా మగుండం నగరపాలక సంస్థలో బీఎల్వో విధుల నుంచి ఆర్పీలు తప్పుకొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. రామగుండం నగరపాలక సంస్థలో 118మంది ఆర్పీలు పని చేస్తుండగా, వీరిలో 112మందికి 2016 నుంచి బీఎల్వోలుగా అదనపు విధులు కేటాయించారు. అంగన్వాడీ టీచర్లకు స్థానికంగానే వారు పనిచేస్తున్న ఏరియాలో బీఎల్వో విధులు కేటాయించి.. ఆర్పీలకు మాత్రం పారిశ్రామిక ప్రాంతంలోని యైటింక్లయిన్‌కాలనీ, రామగుండం, ఎన్టీపీసీ తదితర దూర ప్రాంతాలకు పంపిస్తున్నారు.
దీంతో ప్రయాణ ఖర్చులు, అదనపు పని భారంతో ఇబ్బందులకు గురైన ఆర్పీలు నగరపాలక సంస్థ కమిషనర్‌తోపాటు మెప్మా టీఎంసీల దృష్టికి తీసుకవెళ్లగా వారు కలెక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. దీంతో కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను విన్నవించామని ఆర్పీలు శారద, రాజకుమారి, స్వర్ణలత పేర్కొన్నారు. జిల్లా అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో 112 మంది బీఎల్వోలు విధుల నుంచి తప్పుకోవాలని మూకుమ్మడి నిర్ణయం తీసుకుని రాజీనామా పత్రాలను సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

