హైదరాబాద్, డిసెంబర్28 (నమస్తే తెలంగాణ): ‘కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటా.. విఫలం.. పాలమూరు, డిండికి అన్యాయం’ అన్న అంశంపై తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఫోరం అధ్యక్షుడు దొంతుల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.