దేవరకద్ర, జూన్ 12 : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర అంగన్వాడీ కేంద్రంలోనూ కుళ్లిన కోడి గుడ్లు వెలుగుచూశాయి. గత సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట, జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేటలో కుళ్లిన కోడిగుడ్ల కారణంగా ఇద్దరు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం దేవరకద్ర పట్టణంలోని దళితవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు, చిన్నారులకు పంపిణీ చేసిన కోడిగుడ్లు కుళ్లిపోయినట్టు గుర్తించారు. దీనిపై బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.