హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ ): ఇంధనశాఖ కార్యదర్శిగా, టీజీ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా నియమితులైన రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత సచివాయంలో ఇంధనశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖైరతాబాద్‌లోని విద్యుత్తు సౌధకు చేరుకొని సీఎండీగా చార్జ్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య, నాజర్ షరీఫ్, వీ పరమేశ్, సీహెచ్ అనురాధ, ఐ స్వామి, కే వెంకటేశ్వర్లు, సత్యనారాయణ ప్రసాద్, తెలంగాణ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఇన్చార్జి అధ్యక్షుడు ఏ వెంకటనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి పీ సదానందం నేతృత్వంలోని ప్రతినిధి బృందం రోనాల్డ్ రోస్కు శుభాకాంక్షలు తెలిపారు.