దుండిగల్,సెప్టెంబర్ 25: సూరారంలోని మల్లారెడ్డి నారాయణ వైద్యశాలలో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సేవలను బుధవారం సినీనటి జయసుధ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ అతితక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లకు మెరుగైనచికిత్స అందించడమే లక్ష్యంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మల్లారెడ్డి నారాయణ, మల్లారెడ్డి హెల్త్‌సిటీ వైద్యశాలల చైర్మన్ సీహెచ్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్ సీహెచ్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి రోబోటిక్ శస్త్ర చికిత్సలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్, ఆర్థోపెడిక్ సర్జన్ అంజనికుమార్ మాట్లాడుతూ రోబోటిక్ యంత్రాల ద్వారా సూక్ష్మమైన, సంక్లిష్టమైన అంశాలను గుర్తించవచ్చని పేర్కొన్నారు.
సుల్తాన్‌బజార్,సెప్టెంబర్ 25: పెన్షనర్ల సౌకర్యాలు కుదించే విధానాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ నారాయణరెడ్డి కోరారు. నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు కోఠిలోని కేంద్రీయ సదన్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. 8వ పే కమిషన్ ఏర్పాటు, ఆరోగ్య పథకాలను మెరుగుపర్చడంతో పాటు పెండింగ్ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. సీనియర్ నాయకులు ఎంఎన్ రెడ్డి, కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్ జాతీయ చైర్మన్, టాప్రా కార్యదర్శి వీ కృష్ణమోహన్, నాయకులు ఎన్ సోమయ్య, నాయకులు రామచంద్రుడు, అరుణ, వెంకయ్య, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.