మహబూబ్ నగర్‌లోని కొత్త మొల్గర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న తండ్రి కొడుకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్‌నగర్- నాగర్ కర్నలూ రహదారిపై ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో శంకర్ (45), ఆయన కుమారుడు (18) అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ రహదారిపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు సమాచారం అందుకొని, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు.