మహదేవపూర్(కాళేశ్వరం), అక్టోబర్ 5: ఎగువన కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌కు వరద ప్రవాహం పెరుగుతున్నది. శనివారం బరాజ్ ఇన్‌ఫ్లో 2,99,850 క్యూసెక్కులు కాగా, ఆదివారం బరాజ్ ఇన్‌ఫ్లో 4,29,000 క్యూసెక్కులకు పెరిగింది. బరాజ్‌లోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్‌లో వరద ప్రవాహం గరిష్ఠ ఎత్తు సముద్రమట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 93.50 మీటర్ల ఎత్తులో ఉన్నదని అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి ప్రవాహం సుమారు 6.9 మీటర్ల ఎత్తులో ఉన్నదని వారు పేర్కొన్నారు.