గిర్మాజీపేట/సుబేదారి, అక్టోబర్ 12 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రబ్బానీ, బిల్ కలెక్టర్ రూ.15 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ హరీశ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ పోచమ్మమైదాన్ మండిబజార్‌లో సిగంశెట్టి లవన్‌కుమార్ తన తండ్రి పేరిట ఉన్న ఇంటిని ఇటీవల తల్లి పేరు మీద గిఫ్ట్‌డీడ్ చేశారు. పేరు మార్పు, కొత్త ఇంటి నంబర్ కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసి ఆర్ఐ రబ్బాని, బిల్‌కలెక్టర్ రంజిత్‌ను సంప్రదించారు.
మొదట రూ.40 వేలు డిమాండ్ చేసి, చివరకు రూ.35 వేలకు ఒప్పందం చేసుకున్నారు. మొదటి విడతగా బుధవారం వారు కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయ సమీపంలో 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత సర్కిల్ కార్యాలయంలోని వారి గదిలో సోదాలు చేసి, కొన్ని దస్ర్తాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారి ఇండ్లల్లోనూ సోదా చేయగా ఆర్ఐ వద్ద రూ.5 లక్షలకు పైగా నగదు దొరికినట్టు సమాచారం.
RI, bill collector trapped by