పీహెచ్బీ కాలనీ, జూలై 1: రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. మూసాపేట్ సర్కిల్ పరిధిలోని బాలానగర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మ్యుటేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు. పని పూర్తవ్వాలంటే రూ.80 వేలు లంచం ఇవ్వాలని సునీత డిమాండ్ చేసింది.
చివరికి రూ.30 వేలు ఇవ్వమని తెగేసి చెప్పింది. దీంతో బాధితుడు ఏసీబీని సంప్రదించాడు. మంగళవారం మధ్యా హ్నం ఏసీబీ అధికారుల సూచన మేరకు బాధితుడు రూ.30 వేల నగదు తీసుకెళ్లి సునీతకు ఇవ్వగా, అవినీతి నిరోధకశాఖ డీసీపీ గంగసారి శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు నగదును స్వాధీనం చేసుకొని, సునీతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.