రేవంత్ అసమర్థ పాలనతోనే కరువు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనతోనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆరోపించారు.
- మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
తుంగతుర్తి, అక్టోబర్ 30 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనతోనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఖమ్మం-వరంగల్- నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు.
సీఎం రేవంత్‌కు రియల్ ఎస్టేట్ దందా మీద ఉన్న ధ్యాస ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధ్దిపై లేదని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పరిపాలన కోరుకుంటున్నారని, అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడు ఓట్లు వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీని తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

