రేవంత్ క్షమాపణలు చెప్పాలి
ఓసీ సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు ఖండించారు. ఓసీలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
- ఓసీలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోం
- హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాలి
- ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 5: ఓసీ సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు ఖండించారు. ఓసీలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో జేఏసీ నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలు దిగజారుడు ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు.
కేసీఆర్తో రాజకీయ వైరుధ్యాలు ఉండటాన్ని తప్పుపట్టడం లేదని, కానీ హుందాగా సద్విమర్శలు చేసుకోవాలని సూచించారు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన ఇతర మాజీ ప్రజాప్రతినిధులు సహా జాతి మొత్తాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. రేవంత్రెడ్డి గతంలోనూ అనేకసార్లు కించపరిచే వ్యాఖ్యలు చేసి సీఎం పదవికే మచ్చ తెచ్చారని మండిపడ్డారు. తక్షణమే తన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకులు అండెం రమణారెడ్డి. కొత్తకొండ రవీందర్రావు, చీటి రవీందర్రావు, ద్యావనపల్లి రాంకిషన్ రావు, జిల్లా అంజయ్య, విక్రమ్ నరసింగారావు, తీగల లక్ష్మణ్రావు, తోపు శ్రీనివాస్, గడ్డం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

