ఈడీ కోర్టుకు రేవంత్‌రెడ్డి రావాలి: మత్తయ్య
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సహా ఇతర నిందితులు నాంపల్లి ఈడీ ప్రత్యేక కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని సహ నిందితుడు (ఏ4) జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సహా ఇతర నిందితులు నాంపల్లి ఈడీ ప్రత్యేక కోర్టుకు హాజరై విచారణకు సహకరించాలని సహ నిందితుడు (ఏ4) జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. కేసులో నిందితుల ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్రారంభించి, విచారణను వేగవంతం చేయాలని న్యాయమూర్తిని కోరినట్టు తెలిపారు.
తన తరఫున ప్రభుత్వ న్యాయవాదిని నియమించాలని, కేసు విచారణ త్వరగా చేపట్టాలని మంగళవారం కోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. ఓటుకు నోటు కేసు ప్రారంభమై దశాబ్దానికి పైగా గడుస్తున్నా విచారణ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ఆరోపించారు. ఈడీ కేసు 2021 ఆగస్టు 6న నమోదైందని, ఐదేండ్లు సమీపిస్తున్నా నిందితుల గుర్తింపు, ఎగ్జామినేషన్ వంటి కీలక న్యాయ ప్రక్రియలు ప్రారంభం కాలేదని పేరొన్నారు.
సుప్రీంకోర్టులో కేసులు, ఇతర న్యాయపరమైన అంశాలను సాకుగా చూపుతూ విచారణ వాయిదా పడుతున్నదని విమర్శించారు. ఈ నెల 25న జరిగే తదుపరి విచారణకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నిందితులంతా హాజరుకావాలని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బహిరంగంగా పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

