KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
KTR | ఆదిలాబాద్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ముఖరా (కే) రోడ్డు వద్ద మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు కలిశారు.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్( Adilabad ) లో ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను ముఖరా (కే) రోడ్డు వద్ద మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఎండిపోయిన పత్తి పంటలను కేటీఆర్‌కు చూపించి తమ సమస్యలను వివరించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ కావాలనే తెచ్చిన కరువు అని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, సాగునీరు ఇవ్వకుండా, రైతు భరోసా అందించకుండా రైతుల బతుకులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎండిపోయిన పత్తి పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున, సోయా , ఇతర పంటలకు ఎకరానికి రూ.20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, , బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ముఖరా (కే) రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- destroying
- Farmers lives
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
KTR Tour Photos | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా నీరాజనం.. ఫోటోలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

