హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 9.55 గంటలకు వీడీ సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం సాయంత్రమే సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి బయలుదేరారు.