Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao | రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కరువు మండలాల ప్రకటనే తప్ప ఆర్థిక సహాయం గురించి చేతులెత్తేసారని దుయ్యబట్టారు.
వనపర్తి : రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao ) విమర్శించారు. కరువు మండలాల ప్రకటనే తప్ప ఆర్థిక సహాయం ( Financial assistance ) గురించి చేతులెత్తేసారని దుయ్యబట్టారు. సోమవారం వనపర్తి జిల్లాలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. అనంతరం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Harish Rao 02 01
కరువు మండలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలను ఎలా ఆదుకుంటారో చెప్పలేదని ఆరోపించారు. మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరువు మండలాలను ప్రకటించి ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తే రేవంత్ రెడ్డి నయా పైసా సహాయం చేయాలన్న సోయి లేదని అన్నారు. 5వందల ఎకరాల మియాపూర్ భూములు అమ్ముతా. కమిషన్ కొడతా అనే ధ్యాసలో ఉన్నాడే తప్ప రైతులను ఎట్లా ఆదుకుంటానో చెప్పడం లేదని ఆరోపించారు.
ఎల్‌నినో వల్ల ఎండ బాగ కొడుతది. మంచినీళ్లు దొరకయ్ . పశువులు, మనుషులు చనిపోతారని భయపెట్టిస్తూ ప్రజలను ఎట్లా ఆదుకుంటానో చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నారని, రేషన్ కార్డు మీద రూ.1500 బ్యాంకులో వేశారని, 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేశారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

