స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం భేటీ అయ్యారు. దావోస్‌లో జరుగుతన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో (డబ్ల్యూఈఎఫ్) పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు చేరుకున్నది. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు బృందం కూడా అక్కడికి వచ్చింది. దీంతో రెండు రాష్ర్టాల సీఎంలు, మంత్రులు కాసేపు భేటీ అయ్యారు. ఇరు రాష్ర్టాల్లో పరిస్థితులపై చర్చించుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.