హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో రచనాశైలిలో వేగం పెరుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్(ఎన్ఐఎస్జీ) మాజీ సీఈవో జేఆర్కే రావు చెప్పారు. ఏఐ డాటాను ఉపయోగించే క్రమంలో కచ్చితంగా చెక్‌చేసుకోవాలని సూచించారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్(ఎన్ఐఆర్డీపీఆర్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మాస్టరింగ్ కంటెంట్ క్రియేషన్’ అంశంపై మూడు రోజుల శిక్షణను మంగళవారం జేఆర్కే రావు ప్రారంభించి ప్రసంగించారు.
పనిని వేగవంతంగా చేయడానికి ఏఐ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. వివిధ రాష్ర్టాల నుంచి 40 మంది వరకు హాజరయ్యారు. కార్యక్రమంలో మాతృభూమి ఆన్లైన్ కన్సల్టెంట్ సునీల్ ప్రభాకర్, ఎన్ఐఆర్డీపీఆర్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతీస్ సత్యపాలన్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పీపీ సాహు, అసిస్టెంట్ ఎడిటర్ కిష్ణరాజ్ కేఎస్, ఇప్రెస్సా ఫౌండర్ అంజలి చంద్రన్ పాల్గొన్నారు.