
హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 3: హుజూరాబాద్ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు, తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ క్రమశిక్షణ సంఘం కన్వీనర్ దాసరి భూమయ్య టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్టు తెలిపారు. గతంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, తర్వాత తీన్మార్ మల్లన్న టీంలో క్రియాశీలంగా వ్యవహరించినట్టు చెప్పారు. తీన్మార్ మల్లన్న అవినీతిని రిటైర్డు పోలీస్ అధికారిగా సహించలేకనే టీఆర్ఎస్లో చేరినట్టు స్పష్టంచేశారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. ఆయనతోపాటు హుజూరాబాద్‌కు చెందిన వజ్జినేని రవీందర్రావు, జున్నూతుల రాజేందర్, మరో 50 మంది టీఆర్ఎస్లో చేరారు. అటు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 300 మంది తీన్మార్ మల్లన్న టీం మూకుమ్మడిగా టీఆర్ఎస్లో చేరారు.
కారెక్కిన జిల్లా ఏబీవీపీ మాజీ కన్వీనర్ ఆవుల తిరుపతి
ఏబీవీపీ కరీంనగర్ జిల్లా మాజీ కన్వీనర్ ఆవుల తిరుపతి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. బీజేపీ నేత ఈటల సిద్ధాంతాలు లేని వ్యకి అని మండిపడ్డారు. ఈటల నిజస్వరూపాన్ని గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. కమలాపూర్ మండలం దేశరాజుపల్లికి చెందిన బీజేపీ నాయకుడు జనగాని భిక్షపతి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు బొద్దుల రవీందర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు, చేనేత సహకార సంఘం డైరెక్టర్ ఆడెపు రాజనర్సు(కొత్తపల్లి) టీఆర్ఎస్లో చేరారు.