హైదరాబాద్ : అసలే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలతో జనం ఇబ్బంది పడు తున్నారు. ఇలాంటి సమయంలో ఉచితంగా కూరగాయలు(Free vegetables) పంచితే జనం ఊరుకుంటారా పోటీ పడి తీసుకుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే పెద్దపల్లి జిల్లాలో(Peddapally district) చోటు చేసుకుం ది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లిలో కొద్ది రోజులుగా కూరగాయల మార్కెట్లో హోల్‌సేల్(Whole sale), రిటైల్ (Retail traders )కూరగాయలు వ్యాపారస్తుల మధ్య వివాదం నెలకొంది.
హోల్‌సేల్ వ్యాపారులు వినియోగదారులకు రిటైల్‌గా అమ్మడంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రిటైల్ వ్యాపారస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదిలేక రిటైల్ వ్యాపారస్తులు కూరగాయల మార్కెట్ బంద్ చేసి వినియోగదారులకు ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారు. దీంతో కూరగాయల కోసం జనం ఎగబడుతున్నారు.
ఫ్రీగా కూరగాయలు.. ఎగబడ్డ జనం
పెద్దపల్లిలో కొద్ది రోజులుగా కూరగాయల మార్కెట్లో హోల్ సేల్ మరియు రిటైల్ కూరగాయలు వ్యాపారస్తులకు వివాదం
హోల్‌సేల్ వ్యాపారులు వినియోగదారులకు రిటైల్ గా అమ్మడంతో మేము తీవ్రంగా నష్టపోతున్నామని రిటైల్ వ్యాపారస్తుల ఆవేదన
దీంతో కూరగాయల మార్కెట్ బంద్ చేసి… pic.twitter.com/pgsTPfQpYW
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2024