ఖైరతాబాద్, ఆగస్టు 12: రాష్ట్రంలోని వైన్‌షాపుల వద్ద అక్రమ సిట్టింగులను తొలగించాలని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మీడియా సమావేశంఅలో ఆయన మాట్లాడారు. జీవో 25 ప్రకారం వైన్‌షాప్ పర్మిట్ గది 100 చదరపు మీటర్లు ఉండాలని, ఎలాంటి బెంచీలు, కుర్చీలు, తినుబండారాలు లేకుండా నిర్వహించాలని పేర్కొన్నారు.
వైన్స్‌కు, బార్లకు మధ్య ఉన్న దూరాన్ని పెంచి, బార్ల వైశాల్యంపై విధిస్తున్న అధిక పన్నును ఉపసంహరించుకోవాలని, కనీసం 700 చదరపు మీటర్ల వైశాల్యాన్ని పెంచాలని కోరారు. లైసెన్సు రెన్యువల్ విధానాన్ని ఐదేండ్లకోసారి చేపట్టాలని, బార్ రెంటల్ అగ్రిమెంట్ విధానాన్ని ట్రేడ్ లైసెన్స్ ఫీజులాగా రెంటల్స్‌పై స్టాంప్ డ్యూటీ రూపంలో తీసుకోవాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామకృష్ణ, రాజు గౌడ్, నరసింహగౌడ్, వెంకన్నగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి తిరుపతయ్యగౌడ్, సంయుక్త కార్యదర్శి నిరంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.