సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
సీపీ తరుణ్ జోషి | సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీస్ అధికారులకు సూచించారు.

జనగామ : సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీస్ అధికారులకు సూచించారు. వరంగల్ సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి సారిగా ఆయన జనగాం పోలీస్ స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్‌కు వచ్చే వారికి ఆహద్లకరంగా ఉండే విధంగా మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు.
అనంతరం రిసెప్షన్ కౌంటర్ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో అత్యధికంగా నమోదయ్యే కేసుల వివరాలను సీఐ మల్లేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణతో పాటు, సీపీ కెమెరాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై సీపీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్, ఎస్.ఐలు శ్రీనివాస్, రవికుమార్ , ట్రైనీ ఎస్.ఐలు శ్రీనివాస్, సుమలత తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్‌తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

