రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
మంత్రి గంగుల | రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు. టీఆర్ఎస్ రోజురోజుకు బలపడుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కరీంనగర్ : రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు. టీఆర్ఎస్ రోజురోజుకు బలపడుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయమే దీనికి నిదర్శనమన్నారు. పట్టణాలు, పల్లెల్లోనూ ముఖ్యమంత్రిపై ప్రజల విశ్వాసం చెక్కుచెదరలేదు. మరో 20 సంవత్సరాల వరకు కేసీఆర్ ముందు ఏ శక్తి నిలబడదన్నారు.
హుజరాబాద్లో టీఆర్ఎస్ బలంగా ఉంది. మొత్తం క్యాడర్ అంతా కేసీఆర్ వెంట ఉంటామని చెబుతున్నారు. ఎన్నికలు ఏవైనా కేసీఆర్ బొమ్మను చూసి ఓటు వేస్తున్నారు. వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో అందరితో మాట్లాడుతున్నామని తెలిపారు. పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు విచారణకు, ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది ఆ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

