హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై తెలంగాణ సహా దక్షిణాది రాష్ర్టాలకు తీరని అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సభ్యుల ఆమోదం అనంతరం నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలిసింది.