కామారెడ్డిలో మంకీపాక్స్ కలకలం.. కువైట్ నుంచి వచ్చిన వ్యక్తిలో లక్షణాలు..!
హైదరాబాద్ : కరోనా తర్వాత ప్రపంచదేశాలను వణికిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్. ఇప్పటికే 70కిపైగా దేశాల్లో 16వేలకుపైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇటీవల భారత్లోనే వైరస్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు కేసులు దేశంలో నమోదయ్యాయి. తాజాగా ఈ మహమ్మారి రాష్ట్రంలోనూ కలకలం సృష్టిస్తున్నది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు.
సదరు వ్యక్తి ఈ నెల 6న కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. ఈ నెల 20న సదరు వ్యక్తికి జ్వరం రాగా.. 23న దద్దుర్లు కనిపించాయి. సదరు వ్యక్తి కామారెడ్డిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్లు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. సదరు వ్యక్తి రక్త నమూనాలను సేకరించి.. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
అలాగే సదరు వ్యక్తిని హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతనికి దగ్గరగా ఉన్న ఆరుగురిని ఐసోలేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. వారికి ఎలాంటి లక్షణాలు లేవని, ముందుజాగ్రత్తగా ఐసోలేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సలహాలు సూచనలిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, మంకీపాక్స్ ప్రాణాంతకం కాదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీహెచ్ వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

