రామగిరి, మార్చి 12 : బీసీ ఆత్మగౌరవ భవనాలు కులవృత్తుల పరిశోధనలకు కేంద్ర బిందువులు కావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని నల్లగొండ జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ భవన్లో ఆదివారం విశ్వబ్రాహ్మణ మహిళలకు విశిష్ట సేవా పురసారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.