హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తేతెలంగాణ): రెండో విడతలో మేనేజ్మెంట్ కోటాలో మెడికల్ పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థుల సౌకర్యార్థం రిపోర్టింగ్ గడువును రెండురోజులపాటు పొడిగించారు. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. గడువు సోమవారంతో ముగియనుండగా మరో రెండు రోజులు అంటే ఈ నెల 4 వతేదీ వరకు అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు.
25 మంది హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ఫేషియల్ రికగ్నిషన్ హాజరు (ఎఫ్ఆర్ఎస్) అమల్లో నిర్లక్ష్యం వహించిన 25 మంది హెచ్ఎంలకు పాఠశాల విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీచేసింది. 15 రోజులుగా ఆయా బడుల్లో అటెండెన్స్ నమోదు చేయడంలేదు. దీన్ని సీరియస్గా పరిగణించిన విద్యాశాఖ ఆయా టీచర్లకు నోటీసులు జారీచేసి, వివరణ ఇవ్వాలని ఆదేశించింది.