High Court | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రజల హక్కులకు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అలాంటి వీడియోలను తొలగించాలని యూట్యూబ్ సంస్థను ఆదేశించింది. హైదరాబాద్‌లోని కోకాపేటకు చెందిన మొల్ల శివయ్యతోపాటు ఆయన భార్య, కుమారుడిపై బాచుపల్లికి చెందిన మురళీకృష్ణ దంపతులు ‘మీమాంస విక్టి మ్స్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టారు. తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న వీడియోలను తొలగించాలన్న విజ్ఞప్తి ని యూట్యూబ్ పట్టించుకోలేదని శివయ్య హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ శ్రవణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆయిల్ఫెడ్తోపాటు ప్రైవేటు ఆయిల్‌పాం కంపెనీల పనితీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహనం వ్యక్తంచేశారు. లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌పామ్ సాగు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే తీరు కొనసాగితే… కంపెనీలకు కేటాయించిన జిల్లాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో ఆయిల్‌పామ్ సాగు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. 2024-25లో లక్ష ఎకరాల ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 25,470 ఎకరాలలో ప్లాంటేషన్ పూర్తయిందన్నారు. ఫిబ్రవరి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి కంపెనీ ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్‌పామ్ గెలల ప్రాసెసింగ్ కర్మాగారాల ఏర్పాటు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.