హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఏపీలో పనిచేస్తున్న 144 మంది తెలంగాణ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం అమరావతి వెళ్లిన టీఎన్జీవో ప్రతినిధి బృందం ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. తమ రాష్ర్టానికి చెందిన ఉద్యోగులను తిరిగి తమ రాష్ర్టానికి పంపించాలని తెలంగాణ ప్రభుత్వం గత శుక్రవారం కోరినందున, సాధ్యమైనంత త్వరగా ఆయా ఉద్యోగులను రిలీవ్ చేయాలని టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్ష ప్రధా న కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎండీ ముజీబ్ హుస్సేనీ కోరారు. వినతిపత్రం సమర్పించినవారిలో అసొసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస్‌రావు, హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు కట్కూరి శ్రీకాంత్, నర్సింహారెడ్డి, కొండల్‌రెడ్డి, చంద్రశేఖర్, మహేందర్, ఖాజా, రజని తదితరులు ఉన్నారు.