జనగామ: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Ex-Minister Dayakar Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అక్రమ అరెస్టు చేసిన ఆర్జీ టీవీ యూట్యూబ్ జర్నలిస్ట్ రాజ్ కుమార్‌ను శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దయాకర్ రావు విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ లోని లగచర్లలో అమాయక గిరిజన రైతులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డిది మొదటి నుంచి కక్షసాధింపు ధోరణి అని విమర్శించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గమైన పాలన చూడలేదని తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని కొండాపురంకు చెందిన కాంగ్రెస్ గిరిజన నాయకుడు శ్రీనివాసు తన భార్య కాపురానికి రావడం లేదంటూ పీఎస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంలో శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు పీఎస్ లో అక్రమంగా కొట్టించడంతో తాను ఒంటిపై పెట్రోల్ పోసుకున్నట్లు డెత్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
అక్రమ అరెస్ట్‌కు గురైన RG TV జర్నలిస్ట్‌ను జైలులో పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారని RG TV రిపోర్టర్ రాజ్ కుమార్ పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా.. జనగామ సబ్ జైలులో… pic.twitter.com/Y39rEo1qJ3
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2025
తొర్రూరుకు చెందిన ఓ గిరిజన యువకుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి ఇటీవల ప్రభుత్వ నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఆ యువకుడిని రెండు రోజులపాటు పీఎస్ లో పెట్టి కొట్టించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నిరుపేద కుటుంబానికి చెందిన ఆర్జీ టీవీ యూట్యూబ్ జర్నలిస్టు రాజ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలో అనుకూలంగా పనిచేసిన వ్యక్తి. ప్రస్తుతం అతను ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన ఛానల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు ధోరణిలో ఆ జర్నలిస్టుపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు.
రాజ్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును విత్ డ్రా చేసుకొని వెంటనే అతడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి పోలీసుల చేత కొట్టిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని రైతులు, మహిళలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు.