ఆర్టీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయండి
టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించా రు. ఆర్టీసీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై గురువారం ఏర్పాటుచేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు జూలై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్టు ప్రకటించా రు. నాగర్‌కర్నూల్, పెద్దపల్లి బస్‌డిపో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
- మంత్రి పొన్నం ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించా రు. ఆర్టీసీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై గురువారం ఏర్పాటుచేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు జూలై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్టు ప్రకటించా రు. నాగర్‌కర్నూల్, పెద్దపల్లి బస్‌డిపో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వేములవాడ, కథలాపూర్, హుజూర్నగర్, కోదాడ, నాగర్‌కర్నూ ల్ బస్ స్టేషన్లకు సైతం త్వరలో శంకుస్థాపనలు చేయనున్నట్టు చెప్పారు.
ఇటీవల ఆత్మహత్య చేసుకొన్న శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతోపాటు త్వరలో రూ. కోటి చెక్కు అందజేయనున్నట్టు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యో గం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కారుణ్య ని యామకాలను వెంటనే పూర్తి చేయాల ని అధికారులకు మంత్రి సూచించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,173 బస్సులు, 38,128 మంది ఉద్యోగులు ఉన్నట్టు వెల్లడించారు. ప్రతి రోజూ 61 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలు పొందుతున్నట్టు వివరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఈడీ సీహెచ్ వెంకన్న, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

