హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్ట్(Singuru Project) నుంచి మంజీరా డ్యామ్‌కు(Manjira Dam) నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల(Release of water) చేశారు. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలకు తాగునీటి అవసరాల కోసం 0.3 టీఎంసీల నీటిని విడుదల చేశారు. నీటిని వదిలిన నేపథ్యంలో నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు, రైతులు, గొర్లకాపరులు అటువైపు వెళ్లకూడదని హెచ్చరించారు.