హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బయోటెక్నాలజీ (గాట్-బీ), బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బెట్) ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ షెడ్యూల్ను ప్రకటించింది. విద్యార్థులు మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేరోజు రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు. ఈ రెండు పరీక్షలను ఏప్రిల్ 23న నిర్వహించనుండగా, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు గ్యాట్-బీ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బెట్ ఎంట్రెన్స్ నిర్వహిస్తారు. దరఖాస్తులు సహా ఇతర వివరాల కోసం http://dbt.nta.ac. in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.