హైదరాబాద్, జూలై 8 (నమస్తే తె లంగాణ): డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేయాలన్న నిరుద్యోగుల ఆందోళన అరణ్యరోదనగానే మిగిలింది. వారి వేదనను ప్రభుత్వం అస్సలు లెక్కేపెట్టలేదు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేసేదే లేదని సంకేతాలు ఇ చ్చింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని సో మవారం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ఒక ప్రకటనను విడుదల చేశారు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల ఆశలు నీరుగారినట్టయింది. ఇక అభ్యర్థులు ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్ల కోసం www.schooledu. telangana. gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు. డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. టెట్ పరీక్ష నిర్వహించి ఆ వెంటనే డీఎస్సీ నిర్వహించడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. రెండు పరీక్షల సిలబస్ వేర్వేరు కాబట్టి డీఎస్సీ ప్రిపరేషన్‌కు కనీసం మూడు నెలల గడువు కావాలని కోరుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అభ్యర్థులు సోమవా రం ఏకంగా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చే యాలని కోరారు. అయినా ప్రభుత్వం మంకుపట్టు వీడకుండా యథాతధంగా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపింది.