న్యూఢిల్లీ: ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న పట్టణానికి చెందిన 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగాడు. ఒకరుకాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 500 మందికిపైగా ఆయనను తిరస్కరించారు. ఆ తిరస్కరణలు అతడిలో పట్టుదలను మరింత పెంచాయి. ఇప్పుడతడు నెలకు రూ. 20 లక్షల వేతనంతో రిమోట్‌గా పనిచేసే అవకాశం కల్పించే ఒక ఓపెన్ఏఐ ప్రాజెక్టును దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన కుటుంబంలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన మొదటి వ్యక్తి ఈ యువ ఇంజినీర్. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏడాదికి రూ. 3.6 లక్షల జీతంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించాడు. అందులో చేరేందుకు 8 నెలల సమయం ఉండటంతో అప్పటి వరకు ఖాళీగా ఉండలేక 500-600 అంతర్జాతీయ రిమోట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అన్నింటిలోనే తిరస్కరణలే ఎదురయ్యాయని తన రెడిట్ పోస్టులో పేర్కొన్నాడు. అన్ని దరఖాస్తుల్లోంచి తనకు ఒకే ఒక్క ఇంటర్వ్యూ కాల్ వచ్చిందని, దానిని ఎలాగోలా సాధించగలిగానని చెప్పుకొచ్చాడు.
ఈవీ చార్జింగ్ స్టేషన్‌కు అనుమతి వచ్చేనా?
అధికారుల మధ్య సమన్వయ లోపంతో కాలయాపన
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వశాఖలంటే ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ సహకరించుకోవాలి. కానీ, ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు విషయంలో అటు ఆర్టీసీకి, ఇటు డిస్కం అధికారుల మధ్య డిష్యుం.. డిష్యుం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. విషయానికి వస్తే.. గ్రేటర్‌లోని హయత్‌నగర్ డిపో-2లో నడుపుతున్న ఎలక్ట్రికల్ బస్సులకు చార్జింగ్ కోసం తాత్కాలికంగా 11కేవీ కనెక్షన్ ఇచ్చారు. బస్సుల సంఖ్య మరింతగా పెరగడంతో ఓవర్‌లోడుతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్టీసీ అధికారులు 33కేవీ డెడికేటెడ్ ఫీడర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ.4కోట్ల డీడీ కూడా కట్టారు. 20 నెలలుగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. నేషనల్ హైవే అథారిటీ అనుమతి కావాల్సి ఉన్నది. ఇది కూడా ప్రతిబంధకంగా మారింది.