మోదీకి ప్రాంతీయ పార్టీలే దిక్కు
ఆనాటి ప్రధాని మోదీ తీరు ప్రస్తుతం లేదని, ప్రాంతీయ పార్టీలకు మనుగడే లేదన్న ఆయన నేడు ఆ పార్టీల పంచనే చేరారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఎద్దేవాచేశారు.
- నాడు ప్రాంతీయ పార్టీల మనుగడే లేదన్నడు
- నేడు ఆ పార్టీ నాయకుల పంచన చేరిండు: మాజీ ఎంపీ వినోద్
మానకొండూర్ రూరల్, జూలై 7 : ఆనాటి ప్రధాని మోదీ తీరు ప్రస్తుతం లేదని, ప్రాంతీయ పార్టీలకు మనుగడే లేదన్న ఆయన నేడు ఆ పార్టీల పంచనే చేరారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఎద్దేవాచేశారు. మోదీ ఇటీవల ప్రాంతీయ పార్టీ నాయకుడు పవన్ వద్దకు వచ్చి చేయి కలిపిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లాలో పదవీ విరమణ చేసిన ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఆదివారం మానకొండూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రాంతీయ భాషల మనుగడను దెబ్బ తీసేలా కొత్త చట్టాలకు హిందీ భాషను అనుసంధానం చేస్తున్నారని, ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు వివరించారు.
రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఉమ్మడి సమస్యల విషయంపై భేటీ అయ్యి ఏం సాధించారని ప్రశ్నించారు. కమిటీ వేశామని అంటున్నారని, అలాంటి కమిటీలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేయలేదా? అని గుర్తు చేశారు. “రాష్ట్రంలో బీఆర్ఎస్ నక్కలా కాచుకొని ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంటున్నారు.. బిడ్డా.. నక్కలా కాదు.. పులిలా ఉన్నాం” అని హెచ్చరించారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని తాము అన్ని విధాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్‌కు సూచించినట్లు గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్ల తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని, కేసీఆర్ నాయకత్వాన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు వస్తే మహిళలకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రతి పక్షంలో ఉన్నా నిద్రపోమని, బలమైన రాజకీయశక్తిగా అవతరిస్తామని స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపులకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్: గంగుల
కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పెద్ద పీట వేస్తున్నదని, ఆనాడు వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు ఆడిన నాటకాన్నే నేడు కాంగ్రెస్ చేస్తున్నదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దుయ్యబట్టారు. పదవీ విరమణ పొందుతున్న ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు రానున్న రోజుల్లో మంచి పదవులు పొందాలని ఆకాంక్షించారు. కొందరు పోతే పార్టీ డీలా కాదని, ప్రజల వెంబడి ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

