హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగా ణ): తెలంగాణలో బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించకపోవడం వల్లనే బీర్లకు కృత్రిమ కొరత ఏర్పడిందనే వార్తలను ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ తోసిపుచ్చారు. ఆయన గురువారం ఒక ప్రకటన చేస్తూ.. తెలంగాణలో ఆరు బీరు తయారు చేసే కంపెనీలు ఉండగా.. లైసెన్స్ షరతుల ప్రకారమే బీర్లు ఉత్పత్తి చేయడానికి వాటిని అనుమతి ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో డిమాండ్ మేరకు, బ్రూవరీస్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అవసరమైన రుసుం చెల్లించిన వారికి మూడు షిప్టులకు అనుమ తి ఇచ్చామని పేర్కొన్నారు.
ఆరు బ్రూవరీస్లో నాలుగు కంపెనీల రోజువారి ఉత్పత్తి సామర్థ్యం 1,66,000 కేసులని, వారు మూడు షిఫ్టుల్లో 4,98,000 కేసులు తయా రు చేయాల్సి ఉంటుందని వివరించారు. కానీ అవి మూడు షిప్టుల్లో కేవలం 2.51 లక్షల కేసుల బీరును మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో వేసవిలో సరాసరి రోజుకు 2 లక్షల కేసుల బీరు అ మ్ముడుపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రూవరీస్ కార్పొరేషన్ డిపోల్లో, బ్రూవరీస్లో 7.57 లక్షల కేసుల బీరు నిల్వలు ఉ న్నాయని వెల్లడించారు. మారెట్లో కింగ్‌ఫిషర్ బ్రాండ్ తప్ప మిగిలిన అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త బ్రాండ్ల అనుమతికి సంబంధించి చాలా ఏండ్లుగా ఉన్న పద్ధతినే కొనసాగిస్తున్నట్టు తెలిపారు. గత ఐదేండ్లలో దాదాపు 360 కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. గడిచిన ఐదు నెలల్లో నాలు గు బీరు బ్రాండ్స్‌ను సరఫరా చేయడానికి కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు.