శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో రెండు గేట్లను అధికారులు మూసివేశారు. సోమవారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 19,744 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,414 క్యూసెక్కుల నీరు (మొత్తం 28,158 క్యూసెక్కుల నీరు) విడుదల కాగా సాయంత్రానికి 58వేలకు క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో నమోదైంది.
కుడి, ఎడమగట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఏపీ పవర్హౌస్ ద్వారా 27,533, తెలంగాణ పవర్హౌస్ ద్వారా 31,784 క్యూసెక్కులు సాగర్ వైపు వెళ్తున్నది. శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.60 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు, ప్రస్తుతం 196.56 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.