Redco | రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాలు : చైర్మన్ సతీశ్రెడ్డి
Redco | పర్యావరణ పరిరక్షణలో భాగంగా రెడ్కో సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాల(Charging Centres)ను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్(రెడ్కో) వై. సతీశ్ రెడ్డి వెల్లడించారు.
యాదగిరి గుట్ట : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రెడ్కో సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ కేంద్రాల(Charging Centres)ను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్(రెడ్కో) వై. సతీశ్ రెడ్డి
వెల్లడించారు. శుక్రవారం రెడ్కో(Redco), ప్రైవేటు(Private) భాగస్వామ్యంతో మొదటి వాహన ఛార్జింగ్ కేంద్రాన్ని యాదగిరిగుట్ట(Yadagiri gutta)లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రికి ఎలక్ట్రిక్ వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలు ఛార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మార్కెట్ ధర కంటే తక్కువ యూనిట్ ధరతో వాహనాలు ఛార్జింగ్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక వసతులు పెంచేందుకు రెడ్కో సంస్థ అహర్నిహలు కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ సిటీ(Hyderabad city)తో పాటు జిల్లాల్లోనూ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ లో రెడ్కో సంస్థ సొంతంగా ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇవి వాహనదారులకు అందుబాటులోకి రాబోతున్నాయన్నాని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ( Environmental protection) లో ప్రజలు పాలుపంచుకోవాలని, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మరింత ఆసక్తి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడాయిగూడెం సర్పంచ్ పోశెట్టి, చార్జింగ్ కేంద్రం యజమాని జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

