Red Cross Awards : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఇండియన్ రెడ్‌క్రాస్ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ సేవలు కనబరిచిన వాళ్లకు 2019-20. 2020-21. 2021-22 వార్షిక సంవత్సరాలకు గానూ బంగారు పతకాలు. సేవా పతకాలను అందించనుంది. వనపర్తి జిల్లాకు అత్యధికంగా నాలుగు బంగారు పతకాలు, నాలుగు సేవా పతకాలు లభించాయని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఖాజా కుతుబుద్దిన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్ రెడ్డి, కొత్తకోట మాజీ తహశీల్దార్ ఎమ్.వెంకటేశ్వర్లుకు బంగారు పతకాలు వచ్చాయి. సుపెరిండెంట్ అఫ్ పోలీస్ కే. అపూర్వరావుతో సహా మరో ముగ్గురికి సేవా పతకాలు ప్రకటించారని ఖాజా కుతుబుద్దిన్ తెలిపారు.
డిసెంబర్ 15వ తేదీన (గురువారం) రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్లో జరగనున్న ప్రత్యేక వార్షిక సర్వ సభ్య సమావేశంలో గవర్నర్ తమిళ సై వీళ్లకు పతకాలను అందచేసి, సన్మానం చేస్తారని ఆయన చెప్పారు. అవార్డ్ గ్రహీతలకు వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యులు, జిల్లా రెడ్ క్రాస్ మండల కమిటీ సభ్యులు అభినందనలు తెలియచేశారు.