హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై చర్యలు తీసుకోవచ్చని సూచించింది. ఈ అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ వారి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ నివేదిక గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ వ్యవహారంలో కీలకమైన అధికారులు అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్రెడ్డి విధుల్లో నిర్లక్ష్యం, విధానపరమైన లోపాలు ఉన్నాయని విజిలెన్స్ కమిషన్ గుర్తించింది.