హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): శతాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఏజీఆర్) గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. మాచర్ల, గరివిడి పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు 15 ఏండ్లపాటు లోతైన అధ్యయనం చేసి శాస్త్రీయ ఆధారాలతో నివేదిక సమర్పించారు. పొట్టేళ్ల ధర ప్రస్తుతం రూ.30 వేలు కాగా, ఈ గుర్తింపుతో రూ.45 వేలు పలికే అవకాశం ఉంది. ఆడ గొర్రెలకు ప్రస్తుతం రూ.10 వేలుండగా.. ఇకపై రూ.15 వేల వరకు పలుకుతాయని ఎస్వీవీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సర్జన్రెడ్డి తెలిపారు.